Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి..

అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి..

- Advertisement -
  • టీఎస్.యుటిఎఫ్ మండల నాయకులు
    నవతెలంగాణ-గండీడ్
    అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి గంటా శ్రీనివాస్,బోర్ కృష్ణయ్య సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి వెలువడుతున్న అక్రమ డిప్యూటేషన్లను,బీఈడీ,డైట్ కళాశాలలకు మెడికల్ గ్రాండ్స్ పేరుతో జిల్లా వ్యాప్తంగా డిప్యూటేషన్లలో బదిలీలకు పాల్పడడం సరైన చర్య కాదని, గతంలో బీఈడీ,డైట్ కళాశాలలకు కొందరు ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు ఇచ్చారని మౌఖిక ఆదేశాలతో మరి కొంతమంది పనిచేస్తున్నారని అన్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ లో కూడా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కాకుండా ఉపాధ్యాయుల స్వార్థం కోసం వారికి అనుకూలమైన పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారని, మానవతా హృదయంతో తీవ్ర అనారోగ్య సమస్యలతోబాధపడుతున్న టీచర్లకు మేలు చేయాల్సింది పోయి, ఆ ముసుగులో అక్రమార్కులకు డిప్యూటేషన్ బదిలీలను ఇస్తున్నారని వారు ఆవేదన చెందారు. నిబంధనలకు విరుద్ధంగా పైరవీలతో డిప్యూటేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో అక్రమ చర్యలపై ఆందోళన చేపడతామని టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ సభ్యులు తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -