Wednesday, June 17, 2026
E-PAPER
Homeకరీంనగర్తాడిచెర్లలో అమ్మమాట..అంగన్ బడిబాట

తాడిచెర్లలో అమ్మమాట..అంగన్ బడిబాట

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.

మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అంగన్ వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి  అన్నారు.అమ్మమాట-అంగన్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైనా తాడిచెర్ల నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ అంగన్ వాడిల్లో చేరిన పిల్లలకు మంచి ఆటపాటలతో కూడిన విద్యానందిస్తామన్నారు.చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్ వాడి కేంద్రాలు దోహదపడుతాయన్నారు.అంగన్ వాడి కేంద్రాల్లో అందించిన పోషకారరంతో పిల్లల మానసిక,శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు.అంగన్ వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని చిన్నారులు,గర్భిణీలు,బాలింతలు వినియోగిoచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు అరుణ,లక్ష్మీ,మణెమ్మ,జయప్రద,ఆయాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -