Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్టీఎన్జీవో కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

టీఎన్జీవో కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ -కంఠేశ్వర్
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవో జిల్లా కార్యాలయం ఆవరణలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జాతీయ పతాకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లా అధికారులకు, ఉద్యోగులకు జిల్లా ప్రజలందరికి 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనులను స్మరించుకొని ఉద్యోగులందరూ క్రమశిక్షణతో ఉద్యోగ విధులు నిర్వర్తించి, ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరవేటలో ప్రముఖ పాత్ర వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆకాంక్షిస్తూ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అందజేసే ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకోబోతున్న అధికారులకు, ఉద్యోగ మిత్రులకు ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన, టిఎన్జిఎస్ పక్షాన శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

వీరితోపాటు కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు సునీత, శివకుమార్, జిల్లా జాయింట్ సెక్రటరీలు జాఫర్ హుస్సేన్, ఇందిర, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్, విజయలక్ష్మి, గీతారెడ్డి, మంగమ్మ, సునీల్, ఐసిడిఎస్ ఫోరం అధ్యక్షురాలు విజయలక్ష్మి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad