Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు..

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు..

- Advertisement -

ఎమ్మెల్యే హామీతో నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం
నవతెలంగాణ – మద్నూర్
: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు మంజూరు చేసింది. వెనుకబడిన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హామీ ఇవ్వడంతో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తలు ఉత్సాహం ఆనందం వ్యక్తం అవుతోంది. శనివారం మూడు కోట్ల నిధులతో మండలంలోని రాచూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ.. ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిద్దామని, నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని తెలిపారు. ముందుగా ప్రకటించిన ఇండ్ల మంజూరు చేసినప్పటికీ పూరి గుడిసె లో నివసించే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -