నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వార్షిక సమావేశం మార్చి 1న ఇందూరు యువత కార్యాలయం లో ఏర్పాటు నిర్వహిస్తున్నట్టు, నెలవారి సమావేశం లో అధ్యక్ష కార్యదర్శులు శుక్రవారం తెలిపారు. ఈ వార్షిక సమావేశం ముఖ్య ఉద్దేశం సంవత్సర కాలంలో చేసిన సేవ కార్యక్రమాలు నిత్యం కొనసాగుతున్న కార్యక్రమాలు, అలాగే భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక పై సమావేశం నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు. ఈ సంవత్సర కాలంలో సేవల్లో ప్రతినిత్యం పాల్గొన్ వారికి సేవ స్పూర్తి అవార్డ్స్ అందించడంతో పాటు ఇందూరు యువత స్వచంద్ సేవ సంస్థ 2 పాటలను ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశం లో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, దర్శనం రాజు, ఇందూరు శేఖర్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
మార్చి 1న ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



