నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దిగంబర్, ఆ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగ పాటిల్, యువ నాయకులు షేక్ ఫరీద్ పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంలో మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో ఇసుక గాని బిల్లుల మంజూరులో గాని ఎమ్మెల్యేతో మాట్లాడి ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు కావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు చురుగ్గా కొనసాగుతున్నట్లు లెంటల్ లెవల్ కు వచ్చినట్లు ఆ నాయకులు పేర్కొన్నారు. ఇండ్లు లేని నిరుపేదలు ఎమ్మెల్యే హామీతో ఇండ్లు నిర్మించుకోవడం నాయకులు సంతోషించారు గ్రామ పెద్దలు పార్టీ నాయకులు అండ తమకు ఎల్లప్పుడూ ఉంటుందని వారి సహకారం అందిస్తున్నారు లబ్ధిదారులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.
చిన్న షక్కర్గాలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES