నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు స్మశాన వాటికలో వీధి దీపాలు లేక, చనిపోయిన ఆత్మీయుల దహన సంస్కారాలలో సమయం ఆలస్యమైన అయినప్పుడు, చీకటి సమయంలో అక్కడ ఊరికి దూరంగా ఉండి, వెలుతురు లేక కంప చెట్లు విపరీతంగా ఉన్నాయి. ఎవరి ఆదరణకు నోచుకోలేక, ముళ్ళు, గాజు పెంకులు, చెత్త చెదారంతో కూరుకుపోయి స్మశాన వాటికలో కాలి నడక నడవడం ఇబ్బందికరంగా మారింది. తమ చరవాణిల సహాయంతో వెలుతురు దారి చూసుకుంటూ.. స్మశాన వాటిక వద్దకు మృతదేహంతో బంధువులు, స్నేహితులు వెళ్తుండగా పరిస్థితిని గమనించి మాజీ కౌన్సిలర్ సంగు భూపతి, తన సొంత ఖర్చుతో ఆలేరులో సబ్స్టేషన్ పక్కకు ఉన్నటువంటి, స్మశాన వాటికలో విద్యుత్ స్తంభం నాటించారు. సేవ చేయడానికి పదవే అక్కర్లేదని స్థానికులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భూపతిని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంగ నరసింహులు, చేక్క రవికుమార్, కర్రె అజయ్, బండ్రు రాము,కొమ్ము శ్రావణ్, పల్లె రంజిత్, ఈ సేవా మార్గంలో భాగస్వాములు అయ్యారు.
స్మశాన వాటికలో విద్యుత్ పోల్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



