నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ పట్టణ కేంద్రంలో దసరా పండుగ పురస్కరించుకొని విద్యుత్ లైట్ల ఏర్పాటుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ రూ. 1 లక్ష వెచ్చించి దాదాపు 100 ఎల్ఈడి బల్బులను విరాళంగా గ్రామ కార్యదర్శి గిరికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరిచినందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలోని వీధి స్తంభాలకు లైట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎన్నం భూపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ యాదవ్, నాయకులు రషీద్, పురుషోత్తమాచారి, కిష్టాల్ ,పుల్లయ్య, శీను తదితరులు ఉన్నారు.
వెల్దండలో విద్యుత్ లైట్ ల ఏర్పాటు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES