– కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పపువ్వు సారాను తయారు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 1995లో సారాను నాటి ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. సారాకు తాను వ్యతిరేకమని అన్నారు. కానీ ఇప్పపువ్వు సారాను తయారు చేసి అమ్మాలని కోరారు. దానివల్ల ఆదివాసీల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఇప్పపువ్వుతో కేక్‌లు, ఐస్‌క్రీమ్, వైన్, బీర్, లడ్డూను తయారు చేయొచ్చని సూచించారు. కోకాకోలా, పెప్సీ తరహాలో ఇప్పకోలాను తయారు చేయొచ్చని అన్నారు. ఇప్పపువ్వుతో డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందన్నారు. క్యాన్సర్, అల్సర్‌ను కూడా నియంత్రిస్తుందని వివరించారు. ఇప్పపువ్వు సారాను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన్ను మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు ఇతర ఎమ్మెల్యేలు అభినందించారు. పోడు భూముల పట్టాలు తీసుకున్న ఆదివాసీలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు గండ్ర సత్యనారాయణ అన్నారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు : మందుల సామేల్
కాచిగూడ నింబోలిఅడ్డలో ఎస్సీ హాస్టల్, మొజంజాహి మార్కెట్ హాస్టల్‌కు నూతన వసతి గృహాలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ సభ్యులు మందుల సామేల్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో అసమానతలను తగ్గించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు.
ఇప్పపువ్వు సారాను తయారు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



