Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుకామారెడ్డి జిల్లాలో సీఎంఆర్ లావాదేవీల్లో అవకతవకలు

కామారెడ్డి జిల్లాలో సీఎంఆర్ లావాదేవీల్లో అవకతవకలు

- Advertisement -

రైస్ మిల్లుల లైసెన్సులు రద్దు చేయాలి

రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేసిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి

రైతు సంఘం ( సిఐటియు ) నేతలు దశరథ్, మోహన్

నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కొన్ని రైస్ మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) లావాదేవీలలో తప్పుడు లెక్కలు చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని, అటువంటి రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకొని వారి లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘం ( సిఐటియు ) జిల్లా అధ్యక్షుడు మోహన్ పటేల్, జిల్లా కార్యదర్శి పి. దశరథం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లాలో కొన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యాన్ని పూర్తిగా ఇవ్వకుండా తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. మార్కెటింగ్ సీజన్ 2024 – 25కు సంబంధించిన సీఎంఆర్ సరఫరా చివరి తేదీ ఫిబ్రవరి 16 తో ముగిసినప్పటికీ, జిల్లాలోని 21 రైస్ మిల్లులు ఇంకా 24,623 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ సరఫరాలో బకాయిలు ఉన్నట్లు సివిల్ సప్లై కమిషనర్ వెల్లడించారని తెలిపారు.

ఇటీవల జరిగిన తనిఖీలలో మూడు రైస్ మిల్లులపై కేసులు నమోదు చేయబడినట్లు, మరికొన్ని రైస్ మిల్లులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. మొత్తం మీద సుమారు రూ.94.89 కోట్ల మేర రైతులకు, ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా రైస్ మిల్లర్లు వ్యవహరించినట్లు ఆరోపించారు. అందువల్ల రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేసిన రైస్ మిల్లర్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని వారి లైసెన్సులు రద్దు చేయాలని రైతు సంఘం నేతలు పి. దశరథం, మోహన్ పటేల్, రజనీకాంత్ ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -