తహసిల్దార్ చందా నరేష్ కు వినతిపత్రం
నవతెలంగాణ-నెల్లికుదురు
విద్యారంగ సమస్యను ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యు.ఎస్.పి.సి భాగస్వామ్య సంగాలైన యూటీఎఫ్ మరియు టి పి టి ఎఫ్, డిటిఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో గురువారం తహసిల్దార్ చందా నరేష్ కి వినతిపత్రాన్ని అందించినట్లు యు.ఎస్.పి.సి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మురళీకృష్ణ తెలిపాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు మరియు ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు యు.ఎస్. పి.సి. భాగస్వామ్య సంఘాలైన యూ. టి.ఎఫ్,టి. పి. టి.ఎఫ్ మరియు డి.టి.ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్ర ద్వారా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. అందుకోసం విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.
అనంతరం యు ఎస్ టి సి జిల్లా బాధ్యులు సంగ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఆరు డి ఏ లను వెంటనే విడుదల చేయాలని పిఆర్సి నివేదిక తెప్పించుకొని 2023 నుండి పిఆర్సి ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు, నూతన ఆరోగ్య పథకం అన్ని రకాల ఆసుపత్రిలో అమలు అయ్యేలా ప్రభుత్వం యజమాన్యాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. యూఎస్ పి సి కమిటీ బాధ్యులు మండల రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని,కేజీబీవీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజేషన్ చేయాలని, మోడల్ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం గత రెండు నెలలుగా హెల్త్ కార్డు కొరకై ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనం నుండి హెల్త్ కార్డు వాటా కోత విధించడం 3వ నెల కూడా సమీపించింది అయినా హెల్త్ కార్డు పై ఎలాంటి విధివిధానాలు ప్రకటించకపోవడం ఏ ఏ ఆసుపత్రుల్లో చికిత్స ఉంటుందో తెలుపకపోవడం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విధివిధానాలు ప్రకటించాలని, అలాగే అన్ని ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కల్పించాలని కోరారు.పాఠశాలలు 27000 వేల నుండి 4000 కు మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అలాగే జీవో నెంబర్ 25 ను సవరించాలని ఉపాధ్యాయుల విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోట జనార్ధన్, యాదగిరి, దేవేందర్, లోకేందర్, వెంకటేశ్వర్లు,సంపత్ రెడ్డి, మధుబాబు, రాజు,ప్రవీణ్,రవీందర్, రవి, నురోద్దీన్, రమేష్, విక్రమ్ సింగ్, రాకేశ్, రాజన్న, భాస్కర్, దర్గయ్య, విజయ, సాగర్, సుమలత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



