Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమతం మారిన ఎస్సీ, ఎస్టీలకు కులం హోదా వర్తించదనడం సరిగాదు

మతం మారిన ఎస్సీ, ఎస్టీలకు కులం హోదా వర్తించదనడం సరిగాదు

- Advertisement -

– సుప్రీం కోర్టు తీర్పును పున:సమీక్షించాలి : సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మతం మారిన ఎస్సీ, ఎస్టీలకు కులం హోదా వర్తించదనీ, వారికి ఎస్సీ, ఎస్టీ కోటాలో ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించవనీ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం సరిగాదని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తన తీర్పును పున:సమీక్షించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ తీర్పు మనువాద సిద్ధాంతాన్ని సమర్ధించడం తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు. ఉత్పత్తి, శ్రమ కులాలను అంటరానివారిగా చూడటం, విద్య, సంపదకు దూరంగా పెట్టడం జరిగిందనీ, రాజకీయ, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురయ్యారని తెలిపారు. మనుస్మృతి సృష్టించిన అణచివేతను తట్టుకోలేక క్రిస్టియన్‌, ముస్లిం మతాల్లో వారు చేరారనీ, అయినా వారి పట్ల కుల వివక్ష పోలేదని పేర్కొన్నారు. ఈ తరుణంలో భారతీయ సామాజిక స్థితిగతులను పరిశీలించి సుప్రీం కోర్టు తన తీర్పును పున: సమీక్షించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -