హెచ్-1బీ వీసాపై వైట్‌హౌస్ క్లారిటీ
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే హెచ్-1బీ వీసాల రుసుమును ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ లక్ష డాలర్లకు పెంచ డం ప్రపంచవ్యాప్తంగా కలకలంరేపుతోంది.ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యూఎస్‌కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగు లకు ఈ మెయిళ్లు పంపుతున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టతనిచ్చారు. హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమనని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్‌టైమ్ లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్‌కు వర్తించదని చెప్పారు.
అది వార్షిక రుసుము కాదు వన్‌టైమ్ ఫీజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES