Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే.!

పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే.!

- Advertisement -

సిపిఐ జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయండి
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు… సోతుకు ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
: పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో  వాల్ పోస్టర్  గోడపత్రికలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి పన్నాల కుమారస్వామిలు మాట్లాడారు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13,14వ తేదీన రేగొండ ఎస్ఎల్ఎన్ గార్డెన్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిలుగా హాజరవుతున్నారని తెలిపారు.మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందన్నారు.మండలం అభివృద్ధి ఆమడ దూరంలో ఉందన్నారు.మండల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు.లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన   పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందన్నారు.సిపిఐ 5వ జిల్లా  మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -