శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో, జి.రాంబాబు యాదవ్ సమర్పకుడిగా, లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత – నటులు మురళీ మోహన్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఈనెల13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,’మా సంస్థలో ఇది 6వ సినిమా. మేము నిర్మించిన గత చిత్రాలన్నీ థియేట్రికల్ గానే రిలీజ్ చేశాం. భోజ్‌పురిలో ఒక సినిమా చేసి, అక్కడ విడుదల చేశాం. హర్రర్ జోనర్‌లో అందరికీ నచ్చేలా మా సినిమాను నిర్మించాం’ అని తెలిపారు.
‘హర్రర్ ఎలిమెంట్స్‌తో పాటు మీకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని హీరోయిన్ ఎస్తేర్ అన్నారు. డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ,’ప్రొడ్యూసర్ శంకర్ రావు ప్రోత్సాహంతో ఈ సినిమాను రూపొందించాను. అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ప్లాన్డ్‌గా ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. మా మూవీ మంచి కంటెంట్‌తో వస్తోంది’ అని చెప్పారు. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ,’మా సినిమాలో ఎస్తేర్, ధన్య, సుప్రియ దెయ్యాల పాత్రల్లో భయపెడతారు. ఎస్తేర్ పెర్ఫార్మెన్స్ మంచి హైలైట్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో, అలాగే ఈనెల మొదటివారంలో వచ్చే సినిమాలు, మాతో పాటు 13న రిలీజ్ అయ్యే సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
అందర్నీ భయపెట్టడం ఖాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


