Magazines

గాజాకు మానవతా సాయం అందించాలి

19 నిమిషాల క్రితం

Humanitarian aid must be provided to Gaza.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం


ఆహారం, నీరు, ఇంధనం, వైద్య సదుపాయాలకు ఆటంకాలు తొలగించాలి

ఐరాసలో 50 దేశాలతో కలిసి భారత్‌ పిలుపు

అంతర్జాతీయ చట్టాలు అమలు చేయాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : గాజాలో యుద్ధం, సంక్షోభంతో అల్లాడుతున్న ప్రజలకు తక్షణమే మానవతా సాయం అందించాలని భారత్‌ అంతర్జాతీయ వేదికపై పిలుపుని చ్చింది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆహారం, తాగునీరు, ఇంధనం, వైద్య సామగ్రి, నివాసానికి అవసరమైన వస్తువులను ఎలాంటి ఆటంకాలు లేకుండా గాజాలోకి అనుమతించాలని కోరింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో మరో 50 సభ్యదేశాలతో కలిసి భారత్‌ మానవతా సాయంపై సంయుక్త పిలుపునకు మద్దతు తెలిపింది. బాధితుల్లో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం జోర్డాన్‌, ఖతార్‌, బ్రిటన్‌ నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో ఐరాసలో భారత ఉప శాశ్వత ప్రతినిధి, రాయబారి యోజ్నా పటేల్‌ పాల్గొన్నారు. గాజాలో మానవతా సాయం, వైద్య సేవలకు మెరుగైన అవకాశాలు కల్పించాలని కోరుతూ రూపొందించిన పిలుపునకు భారత్‌తో పాటు 50 దేశాలు మద్దతు ప్రకటించాయి.

ఇజ్రాయిల్‌లో ఎన్నికల అనంతరం ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం గాజా అంతటా మానవతా సాయం వేగంగా, నిరంతరాయంగా చేరేందుకు అనుమతించాలని ఈ దేశాలు కోరాయి. ఈజిప్టు, జోర్డాన్‌ నుంచి నిర్వహించే సహాయ మార్గాలు సజావుగా పనిచేసేందుకు సహకరించాలని సూచించాయి. నివాసానికి అవసరమైన సామగ్రి, ఇంధనం, తాగునీరు, పారిశుధ్య వస్తువులు, వైద్య సామగ్రిని అదనంగా అనుమతించాలని డిమాండ్‌ చేశాయి. లేకపోతే ప్రజారోగ్య పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్