Magazines

మత స్వేచ్ఛపై విమర్శలను సహించని మోడీ సర్కారు

17 నిమిషాల క్రితం

Modi government intolerant of criticism regarding religious freedom
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం


షార్జీల్‌ ఇమామ్‌ అరెస్టుపై అమెరికా కమిషన్‌ ఆందోళన

భారత రాజ్యాంగ హక్కుల పేరుతో

రాయబారి క్వాత్రా ఎదురుదాడి

న్యూఢిల్లీ : దేశంలో మత స్వేచ్ఛ, పౌర హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మరోసారి ఎదురుదాడికి దిగింది. భారత్‌లో మతపరమైన స్వేచ్ఛను వినియోగించు కున్నందుకే విద్యార్థి నేత షార్జీల్‌ ఇమామ్‌ను నిర్బంధించారంటూ అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) చేసిన వ్యాఖ్యలపై భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు అమెరికా తన పక్షపాతాలను సమీక్షించు కోవాలని హితవు పలికారు. అయితే దేశంలో మత స్వేచ్ఛ, భిన్నాభిప్రాయాలకు ఉన్న అవకాశాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని ఈ ఎదురుదాడి పక్కదారి పట్టిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జేఎన్‌యూ మాజీ విద్యార్థి షార్జీల్‌ ఇమామ్‌ను మత స్వేచ్ఛ కోసం పోరాడిన ముస్లిం వ్యక్తిగా అమెరికా కమిషన్‌ తన ఎక్స్‌ పోస్టులో ప్రస్తావించింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సూత్రధారుల్లో ఒకరిగా ఉన్నారనే ఆరోపణలతో ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. వివాదాస్పద సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక నిరసనల సమయంలో చెలరేగిన ఈ అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు.

అమెరికా కమిషన్‌కు భారత పౌరుల రాజ్యాంగ హక్కులపై తీర్పులిచ్చే అధికారం లేదని క్వాత్రా పేర్కొన్నారు. ఆ సంస్థ నివేదికలు పక్షపాతంతో కూడుకున్నవని విమర్శించారు. అన్ని మతాల వారికి సమాన హక్కులు కల్పించడంలో భారత్‌కు రాజ్యాంగ నిబద్ధత ఉందని చెప్పారు. అయితే విమర్శలను ఖండించడం కంటే, దేశంలో మత స్వేచ్ఛ, పౌర హక్కులపై వస్తున్న సందేహాలకు పారదర్శకంగా సమాధానం చెప్పాలనీ, అది ప్రభుత్వ బాధ్యత అని మేధావులు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్