Magazines

పెట్టుబడిదారుల పట్ల వివక్ష లేదు

15 నిమిషాల క్రితం

There is no discrimination against investors.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

బాబు, వైఎస్, కేసీఆర్ పాలసీలను కొనసాగిస్తున్నాం

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

ఆస్పత్రుల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం : సీఎం రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘తెలంగాణకు పాలసీ పెరాలసిస్ లేదు. పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీ విధానాన్ని తీసుకు వచ్చారు. చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ తీసుకువచ్చిన పాలసీలను కొనసాగిస్తున్నాం. మా మధ్య వ్యక్తిగత, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ విధానాలను మాత్రం ముందుకు తీసుకెళ్తున్నాం. పెట్టుబడులకు కావాల్సిన వాతావరణాన్ని కల్పిస్తున్నాం. అనుమతులు, భూములు, నీరు మొదలగు అవసరాల కోసం ఒక పాలసీ తీసుకువచ్చాం. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. డిసెం బర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నాం. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. పెట్టుబడిదారుల పట్ల మాకు ఎలాంటి వివక్ష లేదు. విధానపరమైన గందరగోళం లేదు. ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి. సర్కార్‌ వాటికి రక్షణ కల్పిస్తుంది’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌‌లోని తాజ్‌‌ కృష్ణలో పబ్లిక్ హెల్త్ సైన్సెస్ సంస్థ (పీహెచ్‌‌ఎఫ్‌ఐ) క్యాంపస్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణకు ప్రతిష్టతో పాటు హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడానికి ఐఎస్‌బీ, నల్సార్ మొదల గు యూనివర్సిటీలు ముఖ్యమైనవన్నారు. రాష్ర్టం లో పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు టిమ్స్‌ ఆస్పత్రులతో పాటు ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌లో కొత్తగా నిర్మిస్తున్నామని పేర్కొ న్నారు.రూ.12వేలకోట్లను ఈ ఆస్పత్రుల నిర్మాణం పై ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పాలకులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంతో పాటు మిడిల్ ఈస్ట్, ఆసియా ఖండంలోని దేశాలు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నా యని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 12 శాతం అక్షరాస్యత, తిండి లేక బురద మట్టి తిన్న పరిస్థితుల నుంచి మిగులు ఆహార ధాన్యాల వరకు నెహ్రూ తీసుకొచ్చిన విధానాల వల్లే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న అనేక మంది ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో సీఈఓలుగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు హైదరాబాద్‌లో తమ శాఖలను ప్రారంభిస్తున్నా యని చెప్పారు. ఇక్కడి విద్యార్థులు అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. పీహెచ్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ కు గొప్ప పేరు తీసుకువస్తుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.​


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్