Magazines

దుర్గామాత మండపం వద్ద విషాద ఘటన.. 17 మంది మృతి

2 గంటల క్రితం

Tragic incident at Durga Mata
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కోల్‌కతా

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని చోర్ బగాన్ సర్వజనీన్ దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట జరగడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని చోర్ బగాన్ సర్వజనీన్ దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట జరగడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్షం ప్రారంభం కావడంతో పండల్ బయట నిలిచి ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో కొందరు రోడ్డుపై ప‌డిపోయి ప్రాణాలు కోల్పోయార‌ని స‌ద‌రు అధికారి పేర్కొన్నారు.


ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం
కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్‌తో కలిసి స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లిన ఆయన, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.


ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "చోర్‌బగాన్ పూజా పండల్‌లో జరిగిన తొక్కిసలాట వార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు అమ్మ దుర్గా దేవి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్