Magazines

ఐక్య ఉద్యమాలు నిర్మించాలి

1 గంట క్రితం

build united movements
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

కమ్యూనిస్టులు లేకుంటే భవిష్యత్‌ లేదు

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టులది కీలక పాత్ర : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఖమ్మంలో కర్నాటి కృష్ణయ్య వర్ధంతి సభలో వక్తలు


​నవతెలంగాణ-నేలకొండపల్లి ​
కమ్యూనిస్టు ఎజెండా లేకుంటే దేశానికి భవిష్యత్‌ లేదని, మోడీ పాలనకు కాలం మూడిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, ఖమ్మం తొలి ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కర్నాటి కృష్ణయ్య 28వ వర్ధంతి సభ శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగింది. కృష్ణయ్య స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి తమ్మినేని, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి దండు సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. భిన్నాభిప్రాయాలు ఉన్నా ఏనాడూ కక్షపూరితంగా వ్యవహరించని నిబద్ధత కలిగిన ఉత్తమ కమ్యూనిస్టు నేత కృష్ణయ్య అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో వామపక్ష ఐక్య ఉద్యమాలను నిర్మించాలని అన్నారు. ​ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాదులు చేస్తున్న దాడుల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు భారం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ​బూర్జువా పార్టీల మాదిరిగా వ్యవస్థను యథాత థంగా ఉంచడం కాకుండా, వ్యవస్థలో మార్పులు తీసుకురావడమే కమ్యూనిస్టుల లక్ష్యమని ‌తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు మొదటి నుంచి చెబుతున్న అంశాలనే నేడు ప్రజలు అర్థం చేసుకుం టూ ఉద్యమ బాట పడుతున్నారని తెలిపారు. ​

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తన చెప్పుచేతుల్లో ఉంచుకుని అక్రమంగా ఓట్ల తొలగింపు, అక్రమ మార్గాల్లో ప్రభుత్వాల ఏర్పాటు వంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవు తోందని, ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. వామపక్ష ఐక్య ఉద్యమాల ద్వారా పాలకుల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల పరిరక్షణ, సమసమాజ స్థాపనే లక్ష్యంగా కమ్యూ నిస్టులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పేదలు, కార్మికులు, రైతులు, కష్టజీవుల హక్కుల కోసం నిలబడేది కమ్యూనిస్టు ఉద్యమమేనని చెప్పారు. దేశంలోని వివిధ ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషిస్తు న్నారని చెప్పారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడారు. ఆంధ్ర మహాసభతోపాటు కమ్యూనిస్టు ఉద్యమంలో కర్నాటి కృష్ణయ్య కీలక పాత్ర పోషించారని కొని యాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ మౌలానా, భాగం హేమంతరావు, జమ్ముల జితేందర్‌‌రెడ్డి, కర్నాటి భాను ప్రసాద్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, సీపీఐ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శులు మారిశెట్టి వెంకటేశ్వరరావు, కె.వి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్