న్యాయం కోసం ఎదురుచూసిన వారికి నిరాశే
తప్పుబడుతున్న న్యాయ నిపుణులు
తీర్పు వచ్చేసరికి ప్రయోజనం శూన్యం
ఏండ్ల తరబడి విచారణ.. కీలక అంశాలపై సుప్రీంకోర్టు జాప్యం
అప్పటికే మారిపోతున్న పరిస్థితులు
న్యూఢిల్లీ : న్యాయం ఆలస్యమైతే అది న్యాయ నిరాకరణతో సమానమన్న న్యాయ సూత్రాన్ని సుప్రీంకోర్టు వ్యవహారశైలి మరో సారి ప్రశ్నార్థకం చేస్తోంది. కీలక రాజ్యాంగ అంశాలపై దాఖలైన పిటిషన్లను విచారించి తీర్పులు వెలువరించేలోగా పరిస్థితులు పూర్తి గా మారిపోతున్నాయి. ఫలితంగా బాధితులకు సకాలంలో న్యాయం అందకపోగా, కొన్ని కేసుల్లో తీర్పులు వెలువడే సమయానికి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. 'ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్న చందంగా న్యాయవ్యవస్థ పరిస్థితి తయా రైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాత కేసులు అలాగే.. అమల్లోకి కొత్త చట్టాలు, విధానాలు
ఒక కేసులో కోరిన ఉపశమనం పరిస్థితుల మార్పుతో సాధ్యం కానప్పుడు దానిని 'ఇన్ఫ్రక్టుయస్' అంటారు. వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరం లేని స్థితికి చేరిన అంశాన్ని 'అకడమిక్'గా పరిగణిస్తారు. గత కొన్నేండ్లలో సుప్రీంకోర్టులో ఇలాంటి ఉదం తాలు అనేకం చోటుచేసుకున్నాయి. రాష్ట్రాలు అదనపు పన్నులు విధించవచ్చా అనే 1994 నాటి కేసు 27 ఏండ్ల తర్వాత విచారణకు రాగా.. అప్పటికే 2017లో జీఎస్టీ అమల్లోకి రావడంతో అసలు వివాదం ప్రాధాన్యం కోల్పోయింది. శాసనసభ ప్రత్యేక హక్కులు, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన 2003 నాటి కేసులోనూ తీర్పు వచ్చేలోగా తమిళనాడు అసెంబ్లీ వివాదాస్పద తీర్మానాన్ని ఉపసంహ రించుకుంది. పరిశ్రమ నిర్వచనంపై రెండు దశాబ్దాలుగా సాగిన న్యాయపోరాటం ముగిసే సమయానికి కొత్త పారిశ్రామిక సంబంధాల చట్టం అమల్లోకి వచ్చింది.
వివాదాస్పద సాగు చట్టాలు, పెద్ద నోట్ల రద్దు పైనా ఇలాగే..!
2020లో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ పూర్తికాకముందే 2021లో మోడీ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. 2016 నాటి వివాదాస్పద పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లకు ఆరేండ్ల తర్వాత తీర్పు వచ్చింది. అప్పటికే నోట్ల మార్పిడి ప్రక్రియ ముగిసిపోయింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2024లో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే సమయానికి దాదాపు రూ.16,500 కోట్ల విరాళాలు రాజకీయ పార్టీలకు వచ్చి చేరాయి.
వాంగ్చుక్, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధం పైనా..
ఇక పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్, జమ్మూకాశ్మీర్ తాజా, మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల నిర్బంధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి చట్టబద్ధతపై తీర్పు ఇచ్చేలోగానే ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులను ఉపసంహ రించుకోవడంతో కేసులు మూసివేయాల్సి వచ్చింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వ్యవ హారంలోనూ సుప్రీంకోర్టు గవర్నర్, స్పీకర్ చర్యలను తప్పుబట్టినా.. ఉద్ధవ్ థాక్రే ముందు గానే రాజీనామా చేయడంతో ఆయన ప్రభు త్వాన్ని తిరిగి ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం, 2023పై సవాళ్లపైనా విచారణలో జాప్యం కొనసాగుతోంది. మరోవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై సుప్రీంకోర్టు స్పందించేలోగానే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయని సీనియర్ న్యాయవా దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంపన్నులు, పాలకులకు తక్షణ న్యాయం.. సామాన్యులకు పెండింగ్ భారం
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే అభిప్రాయం ప్రకారం.. కీలక రాజ్యాంగ అంశాల్లో జాప్యం వల్ల కార్యనిర్వాహక వ్యవస్థకు పైచేయి లభిస్తోంది. ధనవంతులు, అధికారంలో ఉన్న వారికి త్వరగా విచారణ లభిస్తుండగా, సామా న్యుల హక్కులకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉంటున్నాయని ఆయన విమర్శిం చారు. కేసుల నిర్వహణలో సమూల మార్పు లు అవసరమని సూచించారు. న్యాయవా దులు కూడా అనవసర వాదనలు, వాయిదా లతో జాప్యానికి కారణమవుతున్నారని వివరించారు. మరో సీనియర్ న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ మాట్లాడుతూ.. కేసుల ఆలస్యం వల్ల లబ్ధి పొందేది ఎక్కువగా ప్రభు త్వాలేనని అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన రాజ్యాంగ ప్రశ్నలను సకాలంలో పరిష్కరించ కపోతే న్యాయవ్యవస్థ తన బాధ్యతను నిర్వర్తిం చడంలో విఫలమైనట్టేనని హెచ్చరించారు.
అత్యవసర కేసులకు ప్రాధాన్యం అవసరం : న్యాయ నిపుణులు
కేవలం కేసుల సంఖ్య ఎక్కువగా ఉండ టమే సమస్య కాదని, అత్యవసర కేసులకు ప్రాధాన్యం ఇచ్చే విధానం అవసరమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజాస్వా మ్యంలో ప్రభుత్వ అధికారాలకు కళ్లెం వేయా ల్సిన న్యాయవ్యవస్థే జాప్యంతో తన పాత్రను బలహీనపరుచుకుంటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.






కామెంట్లు (0)