నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో శ్రామిక వర్గాల
హక్కులపై దాడి జాతీయ సదస్సులో వామపక్ష నేతలు
ఉమ్మడి ఉద్యమ నిర్మాణానికి పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశం కోసం వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత అవసరమని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. దేశంలో వామపక్ష ఐక్యతను బలోపేతం చేయడంతోపాటు విస్తృత ప్రజాస్వామ్య శక్తుల ఐక్య కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాల్సిన అవశ్యకతపై శనివారం నాడిక్కడ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ‘దేశం కోసం వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. వివిధ వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొని దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లపై చర్చించారు.
వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతా వేదిక (యూఎల్‌డీఎఫ్) కన్వీనర్, జస్టిస్ బి.చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్, ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు రాజీవ్ దిమ్రి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలు కార్మికులు, రైతులు, మహిళలు, యువత తదితర వర్గాల హక్కులపై దాడిని తీవ్రతరం చేస్తున్నా యనీ, ఆర్ఎస్ఎస్-బీజేపీ విభజన రాజకీయాలు దేశ లౌకిక, ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తున్నాయని సదస్సు అభిప్రా యపడింది. ఈ పరిస్థితుల్లో వామపక్ష ఐక్యత కేవలం ఆకాంక్ష మాత్రమే కాదని, అత్యవసరమని పేర్కొంది. దేశం ఎదుర్కొం టున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా, దృఢ సంకల్పంతో పోరాడాలని పిలుపుచ్చింది. కమ్యూనిస్టుల ఐక్యతను ముందుకు తీసుకెళ్లడం, వామపక్ష శక్తుల సమీకరణను బలోపేతం చేయడం, ప్రజల హక్కుల పరిరక్షణకు విస్తృత ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని పునరుద్ఘాటించింది. భారత గణతంత్ర దేశ ప్రజాస్వామ్య, లౌకిక, సమాఖ్య స్వరూపాన్ని కాపాడేందుకు ఐక్య పోరాటాలను విస్తరించాలని తీర్మానించింది
వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీలు ఐక్యంగా పోరాడాలి: ఎంఎ బేబీ
దేశం ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను తిప్పికొట్టేందుకు, దేశ లౌకిక, ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీలు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ పిలుపునిచ్చారు. ఐక్యంగా ముందుకు సాగడంలో విఫలమైతే లౌకిక, ప్రజా స్వామ్య భారత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చ రించారు. ఫాసిస్టు భావజాలంతో కూడిన ఆర్ఎస్ఎస్ దేశాన్ని నియంత్రిస్తోందని విమర్శించారు. ప్రత్యేక రాజకీయ ప్రయో జనాల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును సమావేశ పరిచిందనీ, వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించ కుండా, రాష్ట్రపతికి సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హమని అన్నారు. ప్రశాంతంగా నిరసనలు తెలిపే జంతర్‌మంతర్‌లోనూ ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందనీ, ప్రజా ఉద్యమాలకు వేదిక లైన జంతర్ మంతర్ సహా ఇతర నిరసన స్థలాలను తిరిగి ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌పై వార్తలు వెలువడిన నేపథ్యంలో మూడు కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌లో సమావేశమైనట్టు తెలిపారు. ఎన్డీఏలో లేని పార్టీలన్నింటికీ లేఖలు రాసి ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చి నట్టు చెప్పారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన విజయవంతమైందనీ, పురోగామి విద్యార్థి, యువ జన సంఘాల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. సీజేపీ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కొత్త తరంతో అనుసం ధానం కావడంలో ముఖ్యమైన పాత్ర పోషిం చిందన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు ప్రజలతో, యువతతో బలమైన సంబంధాలు ఏర్పరుచుకోవాలని సూచించారు. చాలామంది ఇప్పటికీ పాత తరహా ప్రచార, సమాచార పద్ధతులనే అనుసరిస్తున్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలతో మమేకం కావాలని అన్నారు.





కామెంట్‌లు (0)