నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన పైడాకుల అశోక్ రెండవసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో మంగళవారం మండల పాత్రికేయులు అశోకుని ఘనంగా సన్మానించారు. మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తిని వెంకట్ మరియు కార్యదర్శి బుచ్చిరెడ్డి ల ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రులందరూ అశోక్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. మండలానికి చెందిన అశోక్ రెండవసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపిక కావడం మండల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. గతంలో కూడా మండలానికి అశోక్ అందించిన సేవలు మరిచిపోలేనియని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు రఘు ఎల్లారెడ్డి రవీందర్ రెడ్డి కృష్ణ ప్రసాద్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షున్ని సన్మానించిన పాత్రికేయులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



