తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు అందించే ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026` వేడుక ఘనంగా జరిగింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు నందమూరి తారక రామారావు స్మారకార్థం నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో పలువురు సినీ ప్రముఖులకు నిర్వాహకులు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ భరత్ భూషణ్, ఎపీఎఫ్డీసి డైరెక్టర్, నిర్మాత చడలవాడ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన కృష్ణ, టీఎఫ్ పీసీ కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, నిర్మాత పుష్కూర్ రామ్ మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ నటి ప్రశాంతి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో కళావేదిక ఎన్టీఆర్ స్మారక కళారత్న అవార్డును నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావుకి అందజేశారు. అలాగే కళావేదిక ఎన్టీఆర్ సేవారత్న అవార్డులను ఉప్పల స్వప్న, డాక్టర్ అంచుల పవన్ కుమార్ కి ప్రదానం చేశారు. సినీ విభాగంలో ఉత్తమ నటుడిగా ఆది సాయికుమార్, ఉత్తమ వైవిధ్య నటుడిగా ప్రియదర్శి, ఉత్తమ నటిగా శివాని నాగారం, జ్యూరీ ఉత్తమ నటిగా ఆనంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ఎంపిక కాగా, ఉత్తమ నిర్మాతలుగా పుష్కూర్ రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా లయ సత్కారం పొందారు. ఈ అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులుగా దర్శకుడు సాయి రాజేష్, శైలేష్ కొలను, పద్మావతి మల్లాది, అనుపమ్ రెడ్డి, నందమూరి సీమంతిని, నందమూరి రూప ఉన్నారు. ఉత్తమ బాలనటి – సుకృతి, ఉత్తమ సంభాషణ రచయిత – ప్రసన్న కుమార్ బెజవాడ, ఉత్తమ సంగీత దర్శకుడు- రీ-రికార్డింగ్ – సురేష్ బొబ్బిలి, ఉత్తమ నేపథ్య గాయనీ – సమీరా భరద్వాజ్, ఉత్తమ పీఆర్ ఓ- తేజస్వీ సజ్జా.
ఘనంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్
- Advertisement -
- Advertisement -



