Friday, May 29, 2026
E-PAPER
Homeసినిమాభిన్నంగా 'రోమాంచకం

భిన్నంగా ‘రోమాంచకం

- Advertisement -

'అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ రూపొందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. ఈ బ్రదర్స్ ఒక యంగ్ టీమ్ తో ‘రోమాంచకం` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మనసుకు హత్తుకునే ఫీల్ తో యూత్ ఫుల్ వైబ్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా లవ్, ఫన్, బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్రెష్ ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ టైటిల్ పోస్టర్ తో కలుగుతోంది.
ఈ చిత్రానికి పెట్టిన ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్ లైన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సరికొత్త కథకు సుమంత్ ప్రభాస్, అనంతిక జంట మరింత ఫ్రెష్ నెస్ తీసు కొస్తున్నారు. ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -