నవతెలంగాణ – భువనగిరి
విశాఖపట్టణంలో నిర్వహించిన సీఐటీయూ 18వ ఆల్ ఇండియా మహాసభలలో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కల్లూరి మల్లేశం ఎన్నికైనారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుండి మొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా తరుపున ఎన్నికైనట్టు తెలియజేశారు.
గతంలో ఎస్ఎఫ్ఐ రామన్నపేట డివిజన్ కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, కేంద్ర కమిటి సభ్యులుగా, సీఐటీయూ ఉమ్మడి జిల్లా కమిటి సభ్యులుగా, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా సహకార సంఘం డైరెక్టర్ గా, యాదాద్రి భువనగిరి జిల్లా టి మాస్ కన్వీనర్ గా , జిల్లా ఉపాధ్యక్షులుగా , జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
27 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై వివిధ ప్రజా సంఘాలలో పనిచేస్తున్నానని, పనిని గుర్తించి నాయకత్వం నాకు జాతీయ కమిటీలో బాధ్యతను అప్పగించిందని తెలిపారు. రానున్న రోజులలో కార్మిక సమస్యలపై ప్రజాఉద్యమాలను నిర్వహిస్తూ సీఐటీయూ పటిష్టత కోసం కృషి చేస్తానని, కార్మిక సంఘాల ఐక్యత కోసం, ఐక్య ఉద్యమాల కోసం పనిచేస్తానని తెలిపారు.



