నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ స్టార్, భారత లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యూపీ టీ20 లీగ్ 2026లో ఆగస్టు 25న జరిగే మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించాడు.
2007-08 దేశవాళీ సీజన్‌లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ, టీ20 అరంగేట్రం చేసిన కర్ణ్.. తొలుత ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. 2012-13 సీజన్‌లో మూడు రంజీ మ్యాచ్‌ల్లో 19.04 సగటుతో 21 వికెట్లు తీసి బీసీసీఐ బెస్ట్ అండర్-25 క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. 2014 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.3.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అన్‌క్యాప్డ్ భారత ఆటగాడికి దక్కిన అత్యధిక వేలం ధర ఇదే.



