Monday, September 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఈ-పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా కొనగాల మహేశ్‌

ఈ-పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా కొనగాల మహేశ్‌

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఈ-పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (టీ-ఈపీసీవోఏ) రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ కొనగాల మహేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేట్‌ టూరిజం ప్లాజాలో అసోసియేషన్‌ నిర్వహించిన కార్యవర్గంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ, తహసీల్దార్‌, ఎంపీడీవో, డీపీవో కార్యాలయాల్లో 2015 నుంచి 1579 మంది ఈపీసీవోఏ పని చేస్తున్నారని తెలిపారు.

కీలకమైన గ్రామ పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో ఈ-పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లుగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్ల కాలంలో వారిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్‌ చానల్‌ ద్వారా జీతాలను చెల్లిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -