- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్థంతి వేడుకలు సోమవారం జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరీ సమ్మయ్య ఆధ్వర్యంలో మండలంలోని కొయ్యుర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన ఆయన ఆశయ సాధనకు అందరు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల రవీందర్, పావురాల ఓదెలు, శంకర్, లక్ష్మణ్, రాజేందర్, రాజిరెడ్డి, సారయ్య పాల్గొన్నారు.
- Advertisement -



