Monday, September 21, 2026
E-PAPER
Homeఖమ్మంపెండింగ్ మెస్ ఛార్జీలు తక్షణమే చెల్లించాలి

పెండింగ్ మెస్ ఛార్జీలు తక్షణమే చెల్లించాలి

- Advertisement -

– ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ 
– ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా 
నవతెలంగాణ-సత్తుపల్లి 

మధ్యాహ్న భోజన కార్మికులకు జూన్ నెల నుంచి పెండింగ్‌లో ఉన్న మెస్ ఛార్జీలను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 1,000 రూపాయల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి  కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావుకు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ  రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అల్పాహారం బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అల్పాహార పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి, స్థానిక వంట కార్మికుల చేతనే కొనసాగించాలని కోరారు.

​కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు నెలసరి వేతనం రూ.10వేలు అమలు చేయాలన్నారు. అలాగే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ , ప్రమాద బీమాతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ రహీమున్నీసా, మండల నాయకులు కుంటా వెంకమ్మ, మహాదేవ లక్ష్మి, కారం నాగలక్ష్మి, పూచి సీత, రత్నమాల, రాఘవమ్మ, సత్యవతి, సుజాత, కర్నాటి బసవయ్య, తెలగారపు రామారావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -