జన్మదిన వేడుకల్లో మాజీ సింగిల్ విండో చైర్మన్ విజయ్
నవతెలంగాణ – మద్నూర్
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మ దిన వేడుకలకు మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకల వార్ విజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనం మెచ్చిన నేతగా పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలంగా ముందుకు సాగుతుందని, ఆయన నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లను పంచి పెట్టుకున్నారు.
జనం మెచ్చిన నేత కేటీఆర్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES