Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంపర్వతారోహణలో కర్నూలు యువకుడి రికార్డు

పర్వతారోహణలో కర్నూలు యువకుడి రికార్డు

- Advertisement -

ప్రపంచంలోని టాప్‌-9 శిఖరాల అధిరోహణ
దేశంలోనే తొలి వ్యక్తిగా ఘనత


న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 36 ఏళ్ల పర్వతారోహకుడు తమ్మినేని భరత్‌ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 14 శిఖరాల్లో ఒకటైన చైనాలోని మౌంట్‌ చో ఒయు పర్వతాన్ని (8,188 మీటర్లు) అధిరోహించారు. కాగా ఇప్పటికే ఆయన 8 అత్యంత ఎత్తైన పర్వతాలను విజయవంతంగా అధిరోహిం చారు. తాజాగా మౌంట్‌ చో ఒయు పర్వతాన్ని ఎక్కి.. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలలో తొమ్మిదింటిని అధిరోహించిన మొదటి భారతీయునిగా నిలిచారు. భరత్‌ 2017 మే లో మౌంట్‌ ఎవరెస్ట్‌.. సెప్టెంబర్‌ 2018లో మౌంట్‌ మనస్లు, మే 2019లో మౌంట్‌ లోట్సే, మార్చి 2022లో అన్నపూర్ణ, ఏప్రిల్‌ 2022లో కాంచన్‌జంగా, మే 2023లో మకాలు, అక్టోబర్‌ 2024లో శిశాపాంగ్మా, ఏప్రిల్‌ 2025లో మౌంట్‌ ధౌలగిరి….తదితర 8,000 మీటర్లకు పైగా ఎత్తైన శిఖరాలను అధిరోహించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

మౌంట్‌ చో ఒయు పర్వతాన్ని అధిరోహించడానికి భరత్‌ సెప్టెంబర్‌ 30న చైనాలోని చో ఒయు బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అక్కడి ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం కారణంగా పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు విరమించుకోవాల్సి వచ్చింది. దీంతో నాటి నుంచి అక్కడే ఉన్నారు. మంగళవారం ఉదయం 6.55 గంటలకు ట్రెక్కింగ్‌ ప్రారంభించి, 8.55 గంటలకు పర్వత శిఖరాన్ని చేరుకున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 14 శిఖరాల్లో తొమ్మిదింటిని విజయవంతంగా అధిరోహించి..రికార్డు నెలకొల్పారు. ఇక మిగిలిన 5 పర్వతాలు పాకిస్థాన్‌లో ఉన్నందున ప్రస్తుతానికి వాటిని అధిరోహించేందుకు వీలు కుదరడం లేదని, సమీప భవిష్యత్తులోనే ఆ శిఖరాలను కూడా అధిరోహిస్తానని భరత్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -