Wednesday, January 7, 2026
E-PAPER
Homeనిజామాబాద్రెంజల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా లచేవార్ సుహాసిని

రెంజల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా లచేవార్ సుహాసిని

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్ : రెంజల్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సాటాపూర్ సర్పంచ్ లచ్చేవార్ సుహాసిని నితిన్ ఎంపికయ్యారు. సోమవారం సాటాపూర్ గ్రామంలోని అంజయ్య రైస్ మిల్‌లో మండలానికి సంబంధించిన సర్పంచులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా పోరం అధ్యక్షురాలుగా లచేవారు సుహాసిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా క్యాతం యోగేష్, ఉపాధ్యక్షులుగా మలవత్ విజయ్, ఈరవోయిన మల్లేష్, కార్యదర్శిగా జ్యోతి కార్తీక్, కోశాధికారిగా ఆవుల సవిత నరేష్, కార్యవర్గ సభ్యులుగా మాధవి సాయిలు, జాదవ్ సుమలత రాజు, మాధవ్ వాగ్మేరే, రాథోడ్ అశోక్, ధనుర్ నరసవ్వ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -