Monday, August 31, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రైస్ మిల్ కేసులో జైలుకెల్లిన నాయకులు

రైస్ మిల్ కేసులో జైలుకెల్లిన నాయకులు

- Advertisement -

– బాసర రాజకీయంలో ప్రకంపనలు..!
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ నియోజకవర్గంలోని  బాసరలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే బాసరకు చెందిన మాజీ సర్పంచ్ దయాల లక్షణ్ రావు, కిర్గుల్ (బి)మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రావు,మల్కన్నలపై సారంగాపూర్ పోలీసు స్టేషన్ లో సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. రైస్ మిల్క్ ఇచ్చిన ధాన్యాన్ని బియ్యం గా చేసి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకపోవడం తో వీరి పై సుమారు 10 కోట్ల 66 లక్షల పైగా సివిల్ సప్లై అధికారులు అభియోగం మోపారు. ఈ కేసులో సదరు నాయకులను సారంగాపూర్ పోలిసులు అరెస్టు చేశారు. ఆనంతరం నిర్మల్ సబ్ జైైలుకు  ఆదివారం రాత్రి తరలించారు. దీంతో బాసర రాజకీయాలు మరింత వేడెక్కించాయి. బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయం ఉండడంతో బాసరలో ఏ పార్టీ నాయకుడైన నేరుగా రాష్ట్రస్థాయి నాయకులు, అధికారులతో పరిచయాలుంటాయి. ఎందుకంటే దర్శనానికి వచ్చినప్పుడు నాయకులు దగ్గరుండి వారి ఏర్పాట్లలో చుసుకుంటారు.  దీంతో నియోజకవర్గ నాయకులు తోనే కాకుండా రాష్ట్రస్థాయిలో సంబంధాలు ఉంటాయి.ఈకేసులో నుంచి ఎలాగైనా బయట పడుతారని నిన్న స్థానికంగా ప్రచారం జరిగింది. రైస్ మిల్ కేసుల పై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో పాటు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ కేసులపై ప్రత్యేకంగా  దృష్టి సారించింది.ఈ కేసులో అయితే పోలీసులు మాత్రం తమ విధి నిర్వహణలో  చాకచక్యంగా వ్యవహరించి సదరు నాయకులను రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు.చట్టం అందరికీ సమానమే అని జవాబు చెప్పిన్నట్లు అయింది.

బాసర రాజకీయలో చక్రం దింపే అధికార పార్టీ నాయకులు సిఎంఆర్ వ్వవహారం లో జైలు కు వేళ్ళటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఉన్న  బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయాల లక్షణ్ రావు తన పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా చిల్లర రాజకీయాలతోనే తాను బలయ్యనాని తన సన్నిహితుల వద్ద అనడంతో బాసర రాజకీయాలు మరింత వేడిని పుట్టింస్తున్నాయి. స్థానిక సోషల్ మీడియా గ్రూప్ లో ఈ కేసు వ్వవహారం పై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -