నవతెలంగాణ-హైదరాబాద్: ఐఐటి-బాంబే క్యాంపస్‌లో ఓ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. హాస్టల్ ప్రాంతంలో ఒక వీధి కుక్కపై చిరుత దాడి చేసింది. ఒక మెట్ల దగ్గర నిలబడి ఉన్న వీధి కుక్కపై కొన్ని క్షణాల లోపే ఆ చిరుత దాడి చేసి నోటితో పట్టుకొని ఎత్తుకెళ్లింది.ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.ఈ సంఘటన జూన్ 19వ తేదీన తెల్లవారుజామున సుమారు 2:00 గంటలకు జరిగింది. క్యాంపస్ నివాస ప్రాంతాల సమీపంలో పెరుగుతున్న చిరుతల సంచారంపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించాయి. ఈ ఘటన విద్యార్థులు, సిబ్బంది, స్థానిక నివాసితులలో భయాందోళనలను కలిగించింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో క్యాంపస్‌లో నివసించే పెంపుడు జంతువుల భద్రతపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల గతంలో పోవాయి (Powai) ప్రాంతంలోనూ, దాని పరిసరాల్లోనూ చిరుతపులులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, నివాస ప్రాంతాలకు ఇంత దగ్గరగా ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని స్థానికులు అంటున్నారు.
ఐఐటి-బాంబే క్యాంపస్‌లో ఓ చిరుత సంచారం..వీడియో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



