- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర: మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం సమీపంలోని తాటిచెట్టుపై పిడుగు పడింది. శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు భారీ శబ్ధంతో పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు వ్యాపించి, చెట్టు మొత్తం కాలిపోయింది. సమీపంలో ఓ వ్యక్తి జీవాలు మేపుతున్నాడు. దీనివల్ల ఎవరికీ ఏ ప్రమాదం జరగనందున అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -