జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు.
మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాల్ని దర్శకురాలు మానస శర్మ మీడియాతో షేర్ చేసుకున్నారు.
మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తరువాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. అలాగే ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. ఫాంటసీ, అడ్వెంచర్‌లతో తీసిన ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది.
ఈ కథని ముందుగా నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పాను. ఆ టైంలోనే ఈ కథను సంగీత్ విన్నారు. ఆయనకి కూడా కథ చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత్ వచ్చారు. సంగీత్ అద్భుతమైన నటుడు. మంచి వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నయన్ సారిక కూడా మంచి నటి. ఆమె పాత్రని ప్రేక్షకులంతా ఇష్టపడతారు.
థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రమిది. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది.
అనుదీప్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే టీజర్‌కు ఆయన ఇచ్చిన ఆర్‌ఆర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఈ చిత్రానికి ప్రధాన బలం. నిహారికతో నాకు మంచి అనుబంధం ఉంది. మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను.
అందమైన చందమామ కథలా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



