Monday, July 27, 2026
E-PAPER
Homeజాతీయంసీఎం విజయ్ కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్

సీఎం విజయ్ కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం విజయ్ కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ నియామకాలు రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలకు (సమానత్వపు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు) విరుద్ధమని పేర్కొంటూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది.

గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన కరూర్ పర్యటనలో బాధితుల కుటుంబాలకు చెందిన 31 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -