- Advertisement -
నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంలో అంబేద్కర్ కళాభవన నిర్మాణానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రూ.1.90 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బరిగెల వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్నేండ్లుగా అంబేద్కర్ నూతన కళాభవనం కోసం ఎదురుచూస్తున్నామనీ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కృషితో త్వరలోనే ఆ కళ సాకారం కానుండటం గొప్ప పరిణామమన్నారు. అనంతరం అంబేద్కర్ సంఘం సభ్యుల తరఫున ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



