నవతెలంగాణ న్యూఢిల్లీ: యూజీసీ నెట్ (డిసెంబర్ సెషన్)సబ్జెక్టుల వారీ పరీక్షా షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 14నుంచి 18వరకు మరియు డిసెంబర్ 21వ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.దేశవ్యాప్తంగా సుమారు 10లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో (ఉదయం 9నుంచి 12వరకు,మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు)నిర్వహించనున్నారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF),అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి నవంబర్ 23న సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు,డిసెంబర్ 7న అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని,ఏవైనా సందేహాలుంటే 011-40759000, 18001804747హెల్ప్‌లైన్ నంబర్లను లేదా [email protected]మెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్‌టీఏ సూచించింది.






కామెంట్‌లు (0)