Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్16న సీఐటీయూ సిద్దిపేట జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

16న సీఐటీయూ సిద్దిపేట జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

– సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్..
నవతెలంగాణ – తొగుట 

16న సీఐటీయూ సిద్దిపేట జిల్లా మహాసభలను జయప్రదం చేయలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లో సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి.భాస్కర్ హాజరై మాట్లాడుతూ సీఐటీయూ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు ఈనెల 16న సిద్ధిపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయని తెలిపారు. ఈ మహసభలలో గత మూడు సంవత్సరాల కాలం లో జరిగిన కృషిని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఇప్ప టికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై భారా లు మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న దరులకు అనుకూ లంగా అన్ని రంగాల కార్మికులకు నెలకు కనీస వేతనం రూ. 26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల నూతన కన్వీనర్ గా ఏ. వసంతను ఏక గ్రీవంగా ఎన్నుకు న్నట్లు తెలిపారు. మహాసభకు ఈ ప్రాంతంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ తొగుట మండల కన్వీనర్ వసంత నాయకులు మాణిక్యం, మల్లేశం, శ్యామ, హేమల త, రాజవ్వ, లావణ్య, అరుణ, ప్రమీల, లచ్చవ్య, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -