4 లేబర్ కోడులను రద్దు చేయాలి
మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలి
సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు సురేష్ గొండ డిమాండ్
నవతెలంగాణ – మద్నూర్ : ఈనెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెలో మద్నూర్ మండల మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొంటారని బుధవారం సీఐటీయూ నాయకులు సురేష్ గొండ తెలిపారు. ఆయన నాయకత్వంలో ఎంఈఓ కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోర్టులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26,000 నిర్ణయించి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మండల అధ్యక్షురాలు శాంతాబాయి, ప్రధాన కార్యదర్శి సరస్వతి, మండల కమిటీ నాయకులు ఫర్జానా బేగం, శారద, గంగామణి ,రాణి, జయ శ్రీ, నర్సు బాయి, సావిత్ర తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES