చలి కాలం వచ్చేసింది.. వాతావరణంలోనే కాకుండా శరీరంలో కూడా మార్పులు వస్తాయి. చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. చలి కాలంలో ఇంటి వద్దే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే ఫేస్ గ్లోగా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు ఎక్కువగా తీసుకోవాలి:
ఈ సీజన్‌లో చలి కారణంగా అంతగా నీరు తాగాలనిపించదు. కానీ శీతా కాలంలో చర్మం డ్రైగా మారిపోతుంది. కాబట్టి తగినంత నీరు తాగుతూ ఉండాలి. దీంతో చర్మం స్మూత్‌గా తేమను కోల్పోకుండా గ్లోగా ఉంటుంది.
మాయిశ్చరైజర్ ను మార్చాలి:
సాధారణంగా వర్షా కాలం, వేసవి కాలంలో రాసుకునే మాయిశ్చరైజర్స్ కంటే చలి కాలంలో ఆయిల్ బేస్ ఉండే క్రీములు రాసుకోవాలి. వీలైనంత వరకూ ఆర్గానిక్ ప్రాడెక్ట్స్ వాడటం బెటర్.
ఈ కూరగాయలు తినాలి:
ఈ సీజన్‌లో చర్మానికి మేలు చేసే కూరగాయాలు తింటే స్కిన్ కూడా బాగుంటుంది. చిలగడ దుంపలు, క్యాప్సికం, క్యారెట్, గుమ్మడి కాయ వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఏ, బీ, ఈ, ఐరన్ వంటి ఉంటాయి. ఇవి తీసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
చలి కాలంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటివల్ల స్కిన్ స్మూత్‌గా ఉంటుంది. సాల్మన్ ఫిష్, ఆలీవ్ ఆయిల్, వాల్ నట్స్ లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె స్కిన్ కేర్‌లో కీ రోల్ పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. అలాగే స్కిన్ యంగ్‌గా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చలి కాలంలో రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె మసాజ్ చేసుకుని.. ఉదయాన్నే స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.






కామెంట్‌లు (0)