నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పీఆర్టీయూ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా పి వెంకట్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆర్ వెంకటేశ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై తీర్మానాలు చేశామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌లో ఉపాధ్యాయులు అర్హత సాధించాలనే నిబంధనను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలనీ, పెండింగ్ బిల్లులను చెల్లించాలని సూచించారు. 317 జీవో బాధితుల సమస్యను పరిష్కరించాలని తెలిపారు. 190 జీవో ప్రకారం స్థానిక జిల్లాలకు రెండేండ్ల డిప్యూటేషన్ ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని కోరారు.
పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులుగా ఎండీ అబ్దుల్లా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



