- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలం గురువారం టిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో 2025 సభ్యత్వ వారోత్సవాల్లో జరిగాయి. ఇందులో భాగంగా డోంగ్లీ మండల పిఆర్టియూ అధ్యక్షులు యం. సునీల్, ప్రధాన కార్యదర్శి కే.మారుతి డోంగ్లి మండలంలోని మొఘ గ్రామ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు దయానంద్ తో పాటు ఆ పాఠశాల ఉపాధ్యాయులందరికి సభ్యత్వం నమోదు చేసినట్లు పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -