Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆనంతరం  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.

అనంతరం మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.190 కోట్ల వ్యయంతో బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి బాసర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాసరను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బాసర ఆలయ అభివృద్ధిపై తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నానని వివరించారు.

ఈ కార్యక్రమంలో దండె విఠల్ ,మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచారి,మాజీ ఎమ్మెల్యే లు విఠల్ రేడ్డి, నారాయణ రావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్,భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనా దేవి, ఆయా శాఖల అధికారులు, తదితరులు. పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad