Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు

వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండల కేంద్రంలోని పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర ఉత్సవాలలో గురువారం సతీ సమ్మేతంగా రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణోత్సవ పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వీరబ్రహ్మేంద్ర స్వామిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -