Saturday, August 8, 2026
E-PAPER
Homeజాతీయంగూడివ్వలేని మోడీ

గూడివ్వలేని మోడీ

- Advertisement -

మురికివాడలపై నిర్లక్ష్యం
ఈ స్కీంలో కట్టిన ఇండ్లలో 70శాతం ఖాళీ
}
మౌలిక సౌకర్యాలు కల్పించకుండా తాత్సారం
రాష్ట్రానికి అరకొర ఇండ్ల కేటాయింపు వాటిలోనూ 
రూ.2,389.43 కోట్ల
బకాయిలు పేదలపై చిన్నచూపు

సొంతిల్లు సామాన్యుడి హక్కు…స్వప్నం. దాన్ని నెరవేర్చాల్సిన కనీస బాధ్యత పాలకులది. పరిశ్రమలు, పెట్టుబడుల పేరుతో వేల ఎకరాలను ప్రభుత్వాలు కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతుండటాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ సామాన్యుడు 30 గజాల జాగా కోసం ‘భూపోరాటం’ చేస్తే, వారిపై పోలీసుల ఉక్కుపాదం, ప్రభుత్వాల దుర్నీతిని గమనిస్తూనే ఉన్నాం. 2014కు ముందు దేశంలోని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టించి ఇస్తామనే హామీతో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఏకధాటిన 13 ఏండ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. మరి పక్కా ఇండ్లు ఏమయ్యాయి? అని అడిగితే లక్షల్లో అంకెలు చెప్తూ…అదిగో చాలా చేస్తున్నాం అనే ‘మాయ’ను ప్రచారంచస్తున్నారు. ఓసారి ఆ అంకెల గోల్‌మాల్‌ను పరిశీలిస్తే, విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి.

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
‘అందిరికీ ఇల్లు’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణం-పట్టణం-పీఎమ్‌ఏవై) పేరుతో వేర్వేరుగా రెండు స్కీంలను ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఏడాది జులై 13 వరకు దేశంలో 1 కోటి 27 లక్షలా 68 వేల ఇండ్లను మంజూరు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. వీటిలో 1 కోటి 21 లక్షలా 03 వేల ఇండ్లు గ్రౌండ్‌ అయ్యాయనీ, వాటిలో 99 లక్షలా 07 ఇండ్లను లబ్దిదారులకు అప్పగించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారమే ఏడాదికి దాదాపు 7.61 లక్షల ఇండ్లు దేశంలో కట్టినట్టు గణాంకాల్లో పేర్కొన్నారు. (వీటిలో 2014కు ముందు ప్రభుత్వాలు కేటాయించిన ఇండ్లు కూడా ఉన్నాయి). కానీ.. ఈ కట్టిన ఇండ్లలో 47శాతం ఇండ్లు ఖాళీగానే ఉన్నాయనే విషయం ఎంతమందికి తెలుసు? దానికి మోడీ సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమనే విషయాన్ని ‘గోడీ మీడియా’ ప్రచారంలోకి తేకపోవడం గమనార్హం!

దేశంలోని అత్యంత నిరుపేదల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం చాలా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. వారికి సొంతిళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్తుం ది. అది వాస్తవం కూడా. కాకపోతే ఆ ఇండ్లు ఎవరి కోసం కట్టారో ఇప్పటికీ అర్థంకాని పరిస్థి తులే ఉన్నాయి. రూ.లక్షల కోట్లు కుమ్మరించి, కాంట్రాక్టర్లను బతికించారే తప్ప, పేదలకు ఆ ఇండ్లు ఇవ్వలేదు. కొన్ని చోట్ల ఇచ్చినా, అక్కడ మనుషులు నివాసం ఉండే వాతావరణ పరిస్థి తులు, మౌలిక సౌకర్యాలు లేవు. ఇవేవీ అభూ తకల్పనలు కాదు. స్వయంగా పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిన మాటలు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గుర్తించిన లోపాలు.

70 శాతం ఇండ్లు ఖాళీ
కేంద్ర ప్రభుత్వం మురికివాడల పునరాభివృద్ధి (ఐఎస్‌ఎస్‌ఆర్‌) పథకం కింద దేశంలో 67,806 గృహాలను అత్యంత నిరుపే దల కోసం కట్టించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లోక్‌సభ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ స్టాండింగ్‌ కమిటీకి తెలిపింది. వీటిలో 20,296 ఇండ్లలో పేదలు నివాసం ఉంటున్నారు. మిగిలిన 47,510 ఇండ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. అంటే దాదాపు 70 శాతం ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. సామాన్యుల కోసం కట్టిన ఇండ్లలో 47 శాతం, అత్యంత పేదల కోసం కట్టిన ఇండ్లలో 70 శాతం ఖాళీగా ఎందుకు ఉన్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మళ్లీ కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖే పార్లమెంటరీ కమిటీకి కారణాలు తెలిపింది. ఆ గృహ నిర్మాణ సముదాయాల్లో తాగునీటి సౌకర్యం లేదనీ, రోడ్లు, డ్రయినేజీ లేవనీ, విద్యుత్‌, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి పనులు పూర్తి చేయలేదని చెప్తూనే, అసలు లబ్దిదారులు అక్కడికి వెళ్లేం దుకు ఆసక్తి చూపట్లేదంటూ తప్పును తిరిగి ప్రజలపైకే నెట్టే ప్రయత్నం చేసింది. ఈ నిర్లక్ష్యా న్ని, తప్పిదాలను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమి టీ, కాగ్‌ తీవ్రంగా ఆక్షేపించినా, కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.

ఏహెచ్‌పీలో 47 శాతం ఇండ్లు ఖాళీ
అలాగే లోక్‌సభ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ స్టాండింగ్‌ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం అఫర్డబుల్‌ హౌసింగ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌షిప్‌ (ఏహెచ్‌పీ) స్కీం కింద మరో 9.69 లక్షల ఇండ్లను నిర్మించారు. వాటిలో 5.10 లక్షల ఇండ్లలో పేదలు నివాసం ఉంటున్నారు. గడిచిన 13 ఏండ్లుగా అక్కడే మరో 4.60 లక్షల ఇండ్లు (47 శాతం) ఖాళీగా ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్టులు ఇంత ఘోరంగా విఫలం కావడానికి కారణాలు ఏంటని ఆరాతీస్తే, పేదల పట్ల పాలకు లకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమ వుతోంది. పీఎమ్‌ఏవై-యూ మార్గదర్శకాల ప్రకారం ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. అనేక రాష్ట్రాలు దాన్ని పూర్తి చేయకపోవడంతో ఇండ్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.

నిధులివ్వని కేంద్రం
ఏహెచ్‌పీ స్కీం కింద రాష్ట్రాలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతున్నదని రాష్ట్ర ప్రభుత్వాలు గణాంకాల తో సహా వివరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మంజూరైన 1 కోటి 27 లక్షలా 68 వేల గృహ నిర్మాణాల కోసం రూ.8.96 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని అంచనా వేశారు. దానిలో కేంద్ర ప్రభుత్వ వాటాగా శాంక్షన్‌ చేసిన సొమ్ము రూ.2.12 లక్షల కోట్లు. అది శాంక్షన్‌ మాత్రమే. కానీ రాష్ట్రాలకు ఇచ్చింది కేవలం రూ.1.81 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఇంకా రాష్ట్రాలకు దాదాపు రూ. 91 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేంద్ర ప్రభు త్వం ఇన్ని కోట్లు వృధాగా ఖర్చు చేసిందనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఇదీ గృహ నిర్మా ణంలో మోడీ సర్కార్‌ 13 ఏండ్లలో సాధించిన ‘తిరోగతి’.

‘కాగ్‌’ ఆక్షేపించినా…
పాత గృహ పథకాల్లో ఖాళీగా ఉన్న ఇండ్ల ను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త ప్రణా ళికలు రూపొందించడాన్ని ‘కాగ్‌’ తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో నిర్మిస్తున్న ప్రతి పది ఇండ్లలో ఏడు ఖాళీగానే ఉంటున్నాయని ఆక్షేపించింది. కేవలం లెక్కల కోసం ఇండ్లను కట్టి వదిలేస్తున్నారే తప్ప, వాటిని ప్రజలకు అందచేయాలనే చిత్తశుద్ధి కనిపించట్లేదని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగానే మొట్టికాయలు వేసినా, పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు.

పార్లమెంటరీ కమిటీ చెప్పినా…
కోట్ల రూపాయల ప్రజాధనంతో ఇండ్లు నిర్మించినా, వాటికి రోడ్లు, తాగునీరు, డ్రయి నేజీ, విద్యుత్‌ వంటి కనీస మౌలిక సదుపా యాలు లేకపోవడంతో లక్షలాది ఇండ్లు ఖాళీగా ఉండిపోవడం పీఎమ్‌ఏవై-అర్బన్‌లో అతిపెద్ద లోపమని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ముఖ్యంగా ఐఎస్‌ఎస్‌ఆర్‌ కింద నిర్మించిన ప్రతి పది ఇండ్లలో ఏడు ఇండ్లు ఖాళీగా ఉండడం, నిర్మాణం పూర్తయిందని చెప్పడం మాత్రమే తప్ప, పథకం విజయానికి ప్రమాణం కాదని ఆక్షేపించింది.

తెలంగాణలో
కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అమల్లోకి తెచ్చిన పీఎమ్‌ఏవై (అర్బన్‌, రూరల్‌), ఐఎస్‌ఎస్‌ఆర్‌, ఏహెచ్‌పీ స్కీంల కింద తెలంగాణకు మంజూరు చేసిన మొత్తం ఇండ్లు కేవలం 3,89,372 మాత్రమే. వీటి నిర్మాణం కోసం రూ.37,941.09 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్‌ చేసిన సొమ్ము రూ.6,552.38 కోట్లు. దానిలోంచి ఈ ఏడాది జులై 13 నాటికి విడుదల చేసిన నిధులు రూ.4,168.95 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఇంకా రూ.2,389.43 కోట్లు రావల్సి ఉంది.

అదో మాయాలోకం
తెలంగాణలో కేంద్రం మంజూరు చేసిన ఇండ్లకు, గ్రౌండ్‌ అయిన వాటికి, పూర్తయిన నిర్మాణాలకు మధ్య భారీ అంతరమే ఉంది. కేంద్రం 3,89,372 మంజూరు చేస్తే, వాటిలో 2,73,453 ఇండ్లు గ్రౌండ్‌ అయ్యాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న ఇండ్లు 2,29,673 మాత్రమే. అంటే మరో 1,59,699 ఇండ్లు ‘మాయాలోకం’లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికలో నిర్లక్ష్యం వహించడం వల్లే నిధులు నిలిచాయని కేంద్రం కుంటిసాకులు చెప్తుండటం గమనార్హం.

సీఎం విజ్ఞప్తి
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల సందర్భంగా సీఎం ఏ రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిశారు. పీఎమ్‌ఏవై (గ్రామీణం) 2.0 కింద రాష్ట్రానికి 11,56,915 ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం 19,67,971 గృహాలను శాంక్షన్‌ చేస్తే, తెలంగాణకు కేవలం 3,89,372 ఇండ్లు మాత్రమే మంజూరు చేశారనీ, వాటికి కూడా కేంద్రవాటా
నిధుల్ని సక్రమంగా విడుదల చేయట్లేదని చెప్పుకొచ్చారు. ఈ విజ్ఞప్తిపై కేంద్రం ఇప్పటికీ మౌనంగానే ఉంది.

ఇండ్ల కేటాయింపులోనూ వివక్ష
కేంద్ర ప్రభుత్వం ఇండ్ల కేటాయింపు విష యంలోనూ రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. బీజేపీ, దానికి మద్దతు ఇస్తున్న పార్టీల ఏలు బడిలో ఉన్న రాష్ట్రా లకు ఎక్కువ ఇండ్లు, నిధులు కేటాయి స్తున్నది. ప్రతి పక్ష పార్టీలు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో కేటా యిం పులు, నిధుల విడుదల తక్కువగా ఉన్నాయి. కేంద్రం విడు దల చేసిన జాబితా లోని గణాంకాలు ఈ వివక్షను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు కేంద్రంలోని మోడీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 19,67,971 ఇండ్లు మంజూరు చేసి, 18,70,787 ఇండ్లు గ్రౌండ్‌ చేశారు. వాటిలో 11,38,126 ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. నిధుల విడుదల లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వా ల్సిన రూ.29,998.47 కోట్లలో రూ.24,072.2 కోట్లు విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌, మహా రాష్ట్ర, గుజరాత్‌, వంటి రాష్ట్రాలతో పోలిస్తే, ప్రతిపక్షపార్టీలు అధి కారంలో ఉన్న చోట్ల నిధుల విడుదల తక్కు వగా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబ్బు ఖర్చుచేసినట్టు కాగి తాల్లో చూపారే తప్ప, క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు మాత్రం కనిపించట్లేదు. ఇదే విష యాన్ని కాగ్‌ సహా పార్లమెంటరీ కమిటీలు కూడా గుర్తించి, కేంద్రాన్ని మందలించాయి.

​రాష్ట్రాలకు కేంద్ర బకాయిలు
దేశంలోని 20 రాష్ట్రాలు, 8 ఈశాన్య రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ పథకాల కింద పేదల పేరుతో గృహ నిర్మాణాలు చేపట్టారు. 1 కోటి 27 లక్షలా 28 వేల ఇండ్ల నిర్మాణం కోసం రూ.8.96 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. దానికోసం కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.2.12 లక్షల కోట్లు శాంక్షన్‌ చేసి, రూ.1.81 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేశారు. మంజూరైన సొమ్ములోంచి రాష్ట్రాలకు ఇంకా రూ. 91 వేల కోట్లు రావల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -