– అధ్యక్ష్యకార్యదర్శులు గా గ్యాలంకి అశోక్ కుమార్ పింగిలి రాము లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం లో సోమవారం ఎమ్మార్పీఎస్ మండల కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జి ములకలపల్లి రవి సూచనలతో మండల ఇన్‌చార్జి దేపంగి రమణయ్య, కో-ఇన్‌చార్జి పకీరయ్య ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది.
మండల అధ్యక్షుడిగా గ్యాలంకి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పింగిలి రాము, అధికార ప్రతినిధిగా దాసరి సురేష్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వేల్పుల సుదర్శన్, అయినంపూడి ప్రదీప్, కొత్తపల్లి శివ, కోశాధికారిగా తగరం శివను ఎంపిక చేశారు. పలువురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి సీతారాములు,నార్లపాటి సత్యం, నార్లపాటి మహేష్, జుజ్జారపు రాంబాబు, సురేష్, హరిబాబు, తగరం ముత్తయ్య, మారపాక శ్రీను,తగరం జానీ తో పాటు పలు గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.



