Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుల్కల్ గ్రామ అభివృద్దే నా లక్ష్యం: సర్పంచ్

పుల్కల్ గ్రామ అభివృద్దే నా లక్ష్యం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
మండలంలోని పుల్కల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని సర్పంచ్ సంతోష్ పటేల్ అన్నారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సంతోష్ పటేల్ ఆధ్వక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను గ్రామస్తులు గ్రామసభలో సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు.

ఇందులో ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ మొక్కల పెంపకం గ్రామ నిధుల ఖర్చు గ్రామంలో మౌలిక వసతులు కల్పన తదితర విషయాలను సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలు అధికారులతో చర్చించారు. అంగన్వాడి సెంటర్లో నీటి కొరత ఉందని సర్పంచ్ దృష్టికి తీసుకురాగా వెంటనే బోర్ వేసి మొటరు బిగించి నిటి సరఫరా చేయాలని తీర్మానించారు. ఎస్సీ వాడలోని రైస్ మిల్ వరకు సిసి రోడ్డు నిర్మాణం కోసం తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రకాష్, ఉపసర్పంచ్ పద్మిని తుకారాం, వార్డ్ నెంబర్ లు రాజు, అశోక్, సంతోష్, గౌస్, గంగామణి, బాలరాజ్, నవనీత నేతాజీ, సాయిలు, శంకర్, లక్ష్మీ నాందేవ్, వీరమని గోపాల్ రెడ్డి,గ్రామ ప్రజలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -